Breaking News

పాకిస్తాన్‌లో ఎస్పీ ఆత్మహత్య.. భారత్‌ ఏజెంట్‌? ఆపరేషన్‌ సిందూర్‌లో సాయం?

Published on Fri, 10/24/2025 - 09:39

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సీనియర్‌ పోలీసు అధికారి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఒక ఫోన్ కాల్ అందుకున్న కాసేపటికే ఆయన ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. మరోవైపు.. సదరు అధికారి భారత్‌ ఏజెంట్‌ అని.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఆయనే భారత్‌కు సాయం చేశారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్‌లోని ఐ-9 ప్రాంతంలో ఉన్న ఎస్పీ కార్యాలయంలో అదీల్ అక్బర్ ఎస్పీగా పని చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజులాగే విధులకు వెళ్లిన అక్బర్‌.. గురువారం కూడా స్టేషన్‌కు వెళ్లారు. ఇంతలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడిన కాసేపటికే.. ఆయన ఆవేశంతో ఊగిపోతూ తన గన్‌మెన్ వద్ద నుంచి తుపాకీని లాక్కుని ఛాతీలోకి కాల్చుకున్నారు. దీంతో, షాకైన గన్‌మెన్ వెంటనే తేరుకుని.. అదీల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనకు చివరగా ఫోన్ చేసింది ఎవరు, ఆయనతో ఏం మాట్లాడారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాల్ రికార్డింగ్‌లు, మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక, అదీల్ అక్బర్ సియాల్‌కోట్ జిల్లాలోని కమోంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన గతంలో బలూచిస్థాన్‌లో కూడా సేవలు అందించారు. అయితే, ఎస్పీ అదీల్‌ అక్బర్‌ ఆత్మహత్య తర్వాత సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇస్లామాబాద్ ఎస్పీ అదీల్ అక్బర్ భారతదేశ ఏజెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ సమయంలో అదీల్‌ అ‍క్బర్‌.. మన సైన్యానికి ఇన్‌పుట్స్‌ ఇచ్చారని.. అవి మనకు సాయం చేశాయనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
 

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)