Breaking News

ట్రంప్‌, నెతన్యాహులపై ఇరాన్‌ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు

Published on Mon, 06/30/2025 - 08:12

టెహ్రాన్: ఇరాన్‌లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల దరిమిలా ఆ దేశాలపై ఇరాన్‌ గుర్రుగా ఉంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్‌కు చెందిన షియా మత పెద్ద గ్రాండ్ అయతోల్లా నాసర్ మకరెం షిరాజీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై  ‘ఫత్వా’ జారీచేశారు. వారిని దేవుని శత్రువులుగా అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంపై బెదిరింపులకు దిగుతున్న అమెరికన్, ఇజ్రాయెల్ నేతల సామ్రాజ్యాలను  కూలదోయాలని మకరెం షిరాజీ  ఒక ఉత్తర్వులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు.
 

ఇరాన్‌ నేతలను బెదిరించే ఏ వ్యక్తి నైనా యుద్ధ నేతగా పరిగణిస్తారని మకరెం తన తీర్పులో పేర్కొన్నట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మొహరేబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి. ఇరానియన్ చట్టం ప్రకారం, మొహరేబ్‌గా గుర్తించినవారికి ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేదనం చేయడం లేదా బహిష్కరించడం లాంటివి చేస్తారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా.. ఈ శత్రువులు మాట్లాడిన మాటలు, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరమని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. జూన్ 13న ఇరాన్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడులను ప్రారంభించింది. 12 రోజులపాటు సాగిన ఈ యుద్ధం అనంతరం ఈ మతపరమైన ఆదేశం వెలువడింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసేందుకు అమెరికా.. ఇజ్రాయెల్ దళాలతో చేరిన దరిమిలా ఈ యుద్ధం ముగిసింది.

ఇది కూడా చదవండి: ‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్‌.. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)