Breaking News

మా భూమిపై కాలు పెడితే అంతే.. ఇరాన్ హెచ్చరిక

Published on Thu, 01/29/2026 - 02:12

ఇరాన్, అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్  అబ్బాస్ అరఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రియమైన భూమిపై జరిగే దాడిని ఎదుర్కొవడానికి ఇరాన్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అందుకోసం భద్రతబలగాలు ట్రిగ్గర్‌పై వేలు ఉంచాయన్నారు.

ప్రస్తుతం ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌ వైపు తమ భద్రతా బలగాలు కదిలాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. ఏ సమయంలోనైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ" మా శక్తివంతమైన సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారి వేలు ట్రిగ్గర్స్ పై ఉన్నాయి. మా గాలిపై, భూమిపై, సముద్రంపై, ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కొవడానికి వారు రెడీ అని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే సమయంలో  ఇరు దేశాలకు ప్రయోజనకరమైన న్యాయమైన అణు ఒప్పందాన్ని ఇరాన్ స్వాగతిస్తుందని తెలిపారు.

అయితే ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. అణ్వయుధ ఒప్పందంపై ఇరాన్ పాలకులు చర్చలకు అంగీకరించకపోతే తమ తదుపరి దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. దీనికోసం అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికా నేవీ గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశించిందని తెలిపారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)