ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు

Published on Sun, 10/15/2023 - 12:28

టెహ్రాన్‌: గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం అదుపు తప్పుతోందని ఇరాన్ హెచ్చరించింది. తక్షణమే ఆపకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్-నియంత్రిత గాజా భూభాగంలో ఇజ్రాయెల్ భూతల దాడులు  చేస్తే  ప్రతిస్పందించవలసి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఇరాన్ మిషన్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది. 

'గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలి. పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ రకమైన యుద్ధం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దీని అంతాన్ని ఐక్యరాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత తీసుకునే స్థాయికి వెళుతోంది.' అని ఇరాన్ స్పష్టం చేసింది. 

గాజా భూభాగంలో ఇరాన్ మద్దతుగల హమాస్‌పై భూదాడి చేయడానికి ఇజ్రాయెల్ శనివారం సిద్ధమైంది. అధిక జనసాంద్రత కలిగిన ఈ భూభాగంలో పాలస్తీనియన్లను గాజా దక్షిణం వైపు పారిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దళాలు అడుగులు వేస్తున్నాయి.

ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు.   

ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ హెచ్చరిలతో ఉత్తర గాజావాసులంతా ఇల్లూ వాకిలీ వీడి పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. వందలో, వేలో కాదు! అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్లగా, ఇజ్రాయెల్‌ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతావారూ అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్‌ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు.

ఇదీ చదవండి: ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)