Breaking News

ఇరాన్‌పై యుద్ధం.. డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన!

Published on Tue, 03/10/2026 - 07:15

వాషింగ్టన్‌: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్‌పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్‌ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్‌ ఇచ్చారు.  

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన వారసుడిగా ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రోజే చమురు ధరలు భారీగా పెరిగి, 2022 తర్వాత తొలిసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిదారులు దీన్ని ఇరాన్‌లో యుద్ధం రోజులు తరబడి కొనసాగుతుందనే సంకేతంగా భావించారు.

అయితే అనూహ్యంగా చమురు ధరలు పడిపోయాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదనే అంచనాల నడుమ అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలో మియామి గోల్ఫ్ క్లబ్‌లో రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొంత చెడును వదిలించడానికి మేం మధ్యప్రాచ్యంలో ఓ చిన్న విహారయాత్ర చేశాం. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగా ఉంటుంది. ఆ విషయం మీకు త్వరలో తెలుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో, ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందనే సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు.

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. హర్మూజ్‌ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్‌ ప్రకటించడంతో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద చమురు రవాణా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఫలితంగా అమెరికాలో ఆయిల్‌, గ్యాస్‌ ధరలు అమాంతం పెరిగాయి.

ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక యుద్ధం ముగింపుపై అనిశ్చితి

దాడుల ప్రభావంతో పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. గల్ఫ్ నాయకులు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో జరిగిన సంభాషణల తర్వాత  ‘వివాదానికి రాజకీయ, దౌత్య పరిష్కారం అవసరం’ అని  పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు.

ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్‌ పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్‌ వ్యూహమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)