Breaking News

ఇరాన్‌ అజేయం.. ట్రంప్‌నకు కునుకు కరువు!

Published on Mon, 06/22/2026 - 12:11

ఒకవైపు అమెరికా-ఇరాన్‌ మధ్య తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు.. మరోవైపు ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చేస్తున్న హెచ్చరికలు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా గడ్డపై అడుగుపెట్టడమే సవాల్‌గా మారిన ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు.. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో అజేయంగా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మైదానంలో ఇరాన్‌ పోరాటం ఎంత చర్చనీయాంశమవుతుందో.. సోషల్‌ మీడియాలో ట్రంప్‌పై వస్తున్న మీమ్స్‌ కూడా అంతే వైరల్‌గా మారుతున్నాయి.

2026 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్‌ జట్టు కేవలం ఆటతోనే కాదు.. తమ పట్టుదల, సహనంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. గ్రూప్‌-జీలో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 2-2తో డ్రా చేసిన ఇరాన్‌.. తాజాగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 0-0తో సమం చేసి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేకుండా నిలిచింది.

అయితే ఈ ఫలితాల కంటే ఎక్కువగా చర్చకు కారణమైనది ఇరాన్‌ జట్టు ఎదుర్కొన్న అసాధారణ పరిస్థితులే. అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిమితుల కారణంగా జట్టుకు అమెరికాలో పూర్తిస్థాయిలో బస చేసే అవకాశం లేకపోయింది. దీంతో ఇరాన్‌ జట్టు మెక్సికోలోనే క్యాంప్‌ ఏర్పాటు చేసుకుని, ప్రతి మ్యాచ్‌ కోసం సరిహద్దు దాటి అమెరికాకు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే..

కఠిన భద్రతా తనిఖీలు, ప్రయాణ ఇబ్బందులు, యుద్ధ ఉద్రిక్తతల మధ్య కూడా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే బెల్జియంతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత లాస్‌ ఏంజెలెస్‌ స్టేడియం లాకర్‌రూమ్‌లో ఆటగాళ్లు వదిలి వెళ్లిన ఓ భావోద్వేగ లేఖ వైరల్‌గా మారింది. “మేం గౌరవంగా బయలుదేరుతున్నాం” అంటూ అందులో పేర్కొన్న సందేశం అభిమానులను కదిలించింది.

ఇరాన్‌ ప్రధాన కోచ్‌ అమీర్‌ ఘాలెనోయీ కూడా జట్టు పరిస్థితిని వివరించారు. “గత ఆరు నెలలు యుద్ధ వాతావరణంలో గడిచాయి. దేశీయ లీగ్‌ సక్రమంగా జరగలేదు. అనేక జట్లు మాతో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడటానికి కూడా ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌కు వచ్చి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోకుండా నిలవడం గొప్ప విజయమే” అని వ్యాఖ్యానించారు.

ఇక సోషల్‌ మీడియాలో అయితే ఈ విజయానికి మరో కోణం జత అయ్యింది. అమెరికాతో రాజకీయ ఘర్షణలు కొనసాగుతున్న వేళ.. “అమెరికా గడ్డపై ఇరాన్‌ అజేయం”, “ట్రంప్‌కు నచ్చని రికార్డు ఇదే”, “ఇరాన్‌ అమెరికా నేలపై ఓటమి తెలియని జట్టు”, ‘‘ఆయనకు  ఈ వార్త నచ్చదేమో’’ అంటూ నెటిజన్లు మీమ్స్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లతో ఉన్న ఇరాన్‌.. నాకౌట్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఏమవుతుందో పక్కనపెడితే.. అన్ని అవరోధాల మధ్య అమెరికా గడ్డపై అజేయంగా నిలవడం ద్వారా ఈ ప్రపంచకప్‌లో ఇరాన్‌ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజకీయంగా ఒత్తిళ్లు, భద్రతా సవాళ్లు, ప్రయాణ కష్టాలు.. అన్నింటినీ అధిగమించి ఇరాన్‌ జట్టు వరల్డ్‌కప్‌లో నిలబడిన తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మైదానంలో సాధించిన ఈ ‘అజేయ’ ప్రయాణం.. ట్రంప్‌ను టార్గెట్‌ చేసిన సోషల్‌ మీడియా సెటైర్లకు కూడా కారణమవుతోంది. ఇరాన్‌ తదుపరి మ్యాచ్‌లో ఏమి చేస్తుందన్నదానికంటే.. ఇక్కడివరకు ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు పెద్ద కథగా మారింది.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)