Breaking News

సీజ్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్‌

Published on Mon, 04/20/2026 - 08:31

టెహ్రాన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్‌ నౌకలపై దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. అమెరికా యుద్ధ నౌకలపైకి ఇరాన్‌ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

కాగా, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో ఇరాన్‌ జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌకను అమెరికా సీజ్‌ చేసింది. దిగ్భంధనాన్ని దాటినందుకు తౌస్కా అనే వాణిజ్య నౌకపై  రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియాలో ధ్రువీకరించారు. మరోవైపు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ దీనిపై పోస్టు చేసింది. ఓ నౌక ఇరాన్‌ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్‌ చేసినట్లు పేర్కొంది. దీంతో, ఈ చర్యకు ప్రతిస్పందించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అనంతరం, అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్‌ఆఫ్‌ ఒమన్‌ నుంచి అమెరికా నౌకలను ఐఆర్‌జీసీ తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్‌ అభివర్ణించింది.

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్‌ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. 

అమెరికా నౌకలపై ఇరాన్ దాడి!

ఈ నేపథ్యంలో అసలు చర్చలకు రావడం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్‌ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)