Breaking News

అమెరికా దాడుల ఎఫెక్ట్‌.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్‌

Published on Fri, 06/27/2025 - 08:52

టెహ్రాన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌ ఊహించిన షాకిచ్చింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం సందర్భంగా తమపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ  స్పష్టం చేశారు.

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల మాట్లాడుతూ వచ్చేవారం ఇరాన్‌తో అణుచర్చలు జరగనున్నాయని  పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఈ సందర్బంగా అబ్బాస్‌.. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన మాకు లేదు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా చేసిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇరాన్‌ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో చర్చల్లో పాల్గొనే ఆలోచనే లేదు అని కుండబద్దలు కొట్టారు.

మరోవైపు.. నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. వచ్చేవారం టెహ్రాన్‌తో అణుచర్చలు జరుపుతామన్నారు. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్‌తో ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్‌ చమురుపై ఆంక్షల విషయంలో కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ట్రంప్‌ హింట్‌ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్‌ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్‌ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖతార్‌లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్నీ చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు.  మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై బంకర్‌ బ్లస్టర్‌ బాంబులు, క్రూజ్‌ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అగ్రరాజ్యం ఏమీ సాధించలేకపోయిందని అన్నారు. ఖతార్‌లో అమెరికా స్థావరంపై తాము చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా స్థావరాలకు చేరగల సత్తా తమ దేశానికి ఉందని నిరూపితమైందని అన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన సందర్భాల్లో ఇలాంటి దాడులు చేస్తామని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)