Breaking News

తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్‌ మీడియా కథనాలు

Published on Fri, 03/13/2026 - 14:57

ఇరాన్ కొత్త అత్యున్నత నాయకుడు మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపైపలు అనుమానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి.  అంతర్జాతీయ మీడియాలో వస్తున్న భిన్నమైన కథనాల ప్రకారం  శత్రు పక్షం దాడిలో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కాలు తీసేసారని, కోమాలో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణఘేదీ లేనప్పటికీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.

ది సన్ నివేదిక ప్రకారం, మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని బ్రిటీష్ పత్రిక 'ద సన్' (The Sun) నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హత్యకు గురైన  ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ  56 ఏళ్ల కుమారుడు మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి ,ప్రస్తుతం టెహ్రాన్‌లో చికిత్స పొందుతున్నాడని నివేదించింది. తండ్రిమరణానికి దారి తీసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ  ఖమేనీకి ఒక కాలు (లేదా రెండు కాళ్లు) తొలగించారని, కాలేయం లేదా కడుపు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్‌లో కోమాలో ఉన్నట్లు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.

దీనికి తోడు ఇరాన్‌ సుప్రీంగా ఎన్నికైన తరువాత తొలిసారి మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ఈ కొత్త ఫోటోలను ఇరాన్ మీడియా విడుదల చేసినప్పటికీ, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించినవి లేదా పాత ఫోటోలను ఎడిట్ చేసినవనీ చాలా సంస్థలు అనుమానిస్తున్నాయి.

అయితే ఏఐ ఫోటో అన్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కుమారుడు యూసుఫ్ ఖండించారు. మొజ్తబా ఖమేనీ "సురక్షితంగా, ఆరోగ్యంగా" ఉన్నారని , భద్రతా కారణాల దృష్ట్యా రహస్య ప్రదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. 

 (ఇరాన్‌ వార్‌ : ట్రంప్‌ సరికొత్త వార్నింగ్‌)

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ,  ఖమేనా గాయపడి ఉండవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించడంతో అసలు మొజ్తబా ఖమేనీ సజీవంగా ఉన్నారా లేదా అనుమానాలు మరింతగా చెలరేగాయి. అయితే ఖమేనీ కోమాలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు అదికారిక ధృవీకరణ ఏదీ  లేదు

కాగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో (Operation Epic Fury) మొజ్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీనికోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే తల్లి, భార్యను, కొడుకును, అక్కను, ఆమె భర్తను, వారి పిల్లలు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)