165 మంది విద్యార్థినుల సామూహిక ఖననం

Published on Wed, 03/04/2026 - 04:16

టెహ్రాన్‌: అమెరికా వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 165 మంది విద్యార్థినుల సామూహిక ఖనన క్రతువు వేలాది మంది స్థానికుల సమక్షంలో కొనసాగింది. మినాబ్‌ నగరంలోని బాలికల ప్రాథమిక పాఠశాలపై శనివారం అమెరికా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినుల సంఖ్య తాజాగా 165కి పెరిగిన విషయం తెల్సిందే. మరో 60 మంది గాయపడ్డారు. చనిపోయిన వాళ్లందరినీ ఒకే చోట సామూహికంగా పూడ్చిపెట్టారు. ఇందుకోసం 165 చిన్న గోతులు తీసిన వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వైరల్‌గా మారాయి.

మినాబ్‌ సిటీలో జరిగిన విద్యార్థినుల అంతిమయాత్రలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ‘అమెరికా నాశనం కావాలి’అని నినాదాలు చేశారు. విద్యార్థినుల పారి్ధవదేహాలను ఉంచిన వాహనాలు వీధుల గుండా వెళ్తుండగా వేలాదిగా జనం హాజరై రహదారికి ఇరువైపులా నిలబడి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

పేగు తెంచుకుని పుట్టిన తమ చిన్నారులను కడసారి చూసుకుంటూ తల్లులు దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. తర్వాత అశ్రునయనాలతో తమ చిన్నారులకు వీడ్కోలు పలికారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ శోకసంద్రాలయ్యాయి. పార్థివదేహాలను వాహనాల్లో అంతిమయాత్రగా తీసుకొస్తుండగా వాళ్లను చివరిసారిగా చూసేందుకు జనం ఎగబడ్డారు. ప్రాణాలు కోల్పోయిన అతీనా అనే విద్యార్థిని తల్లి ఆవేదనలతో మాట్లాడారు. ‘‘అమెరికా చేసే ఘోర నేరాలకు నా బిడ్డ మృతదేహమే ప్రబల సాక్ష్యం’’అని కన్నీరుమున్నీరయ్యారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)