నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
స్వస్థలంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి
Published on Sat, 07/11/2026 - 04:24
దుబాయ్: ఇరాన్న 37 ఏళ్లపాటు ఎదురులేకుండా పరిపాలించిన దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలమైన మష్హద్ నగరంలో శుక్రవారం ఉదయం ఖమేనీ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించిన సంగతి విదితమే. తర్వాత ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ నూతన సుప్రీంలీడర్గా నియమితులయ్యారు.
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కారణంగా అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేశారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో అంత్యక్రియలు ప్రారంభించారు. గత వారం రోజులుగా ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతికకాయాన్ని వేర్వేరు నగరాలకు తరలించారు. తమ అభిమాన నేతకు లక్షలాది మంది జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన విగతజీవిగా ఉండడం చూసి చలించిపోయారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఖననం పూర్తయ్యింది. మష్హద్ నగరంలో ఖననం జరిగిన ఇరాన్ రెండో పాలకుడు ఖమేనీ మాత్రమే. దాదాపు 11 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత హత్యకు గురైన నాదిర్ షాను 1747లో ఆ నగరంలోనే ఖననం చేశారు.
Tags : 1