Breaking News

ఇండిగో ఘటన వేళ.. వక్రబుద్ధి చాటుకున్న పాక్‌!

Published on Fri, 05/23/2025 - 12:16

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఢిల్లీ-శ్రీనగర్‌ ఇండిగో  విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం ముందుభాగం బాగా దెబ్బతింది కూడా. అయితే ఆ సమయంలో అప్రమత్తమైన పైలట్‌.. పాక్‌ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట!. 

బుధవారం సాయంత్రం 227 మందితో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇండిగో విమానం బయల్దేరింది. ఈదురు గాలులు, వడగండ్ల కారణంగా  అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ భయపడిపోయారు. ఆ టైంలో అప్రమత్తమైన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)కి సంకేతాలు పంపించారు. మరోవైపు.. 

ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్‌ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట. అందుకోసం లాహోర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతి కోరారు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్‌ ఏటీసీ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో చేసేది లేక చివరకు.. శ్రీనగర్‌లోనే విమానం సేఫ్‌ ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదిలా ఉంటే.. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాక్‌ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భారత్‌కు చెందిన విమానయాన సంస్థలకూ పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ఇవాళ్టితో(మే 23) ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి దానిని పొడిగించే యోచనలో పాక్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఒకేసారి.. ఒక నెల కంటే ఎక్కువ కాలం ఆంక్షలు విధించేందుకు ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ICAO) నిబంధనలు అనుమతించవు.

ఇదీ చదవండి: పాక్‌ ఆర్మీ అధికారి బలుపు కామెంట్స్‌

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)