Breaking News

ఆ‍స్ట్రేలియాలో మోదీ మ్యాజిక్‌.. ఓ రేంజ్‌లో భారతీయుల స్వాగతం!

Published on Tue, 05/23/2023 - 11:00

సిడ్నీ/మెల్‌బోర్న్‌: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వదేశంతో పాటుగా పలు దేశాల్లో అభిమానులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ​కాగా, మోదీ.. ఇప్పటికే పలు దేశాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అభిమానులు, భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాజాగా ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న భారతీయులు ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మోదీని కలిసేందుకు భారత సంతతి ప్రజలు ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుని మరీ వచ్చారు. సోమవారం రాత్రి మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. తాము ప్రయాణించిన విమానానికి మోదీ ఎయిర్ వేస్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇక, మోదీ కోసం 170 మంది కలిసి ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని, తలకు టర్బన్లను కట్టుకుని విమానంలో డ్యాన్స్‌ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే, మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) సిడ్నీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మెల్‌బోర్న్‌లోని మోదీ మద్దతుదారులు, అభిమానులు కూడా సిడ్నీకి బయలుదేరారు. వీరంతా సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. 

ఇది కూడా చదవండి: భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)