Breaking News

ఏరా పులి..!

Published on Fri, 05/30/2025 - 15:22

రేయ్‌.. పులిని చూడాలనుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చెయ్యొచ్చు.. అంటూ ఓ పాపులర్‌ సినిమా డైలాగ్‌ ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేయబోయి తన ప్రాణాలనే రిస్క్‌లో పడేసుకోబోయాడు ఓ భారతీయ టూరిస్టు.

ఈ భూమ్మీద పులులకు స్వర్గధామంగా థాయ్‌లాండ్‌ ఫుకెట్‌(Phuket)కు పేరుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పులులకు మేత వేయొచ్చు.. ఫొటోలు దిగొచ్చు.. అతిదగ్గరగా వాటితో కొంత సమయం గడపొచ్చు. అదంతా వాటి శిక్షకుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే తాజాగా అక్కడికి వెళ్లిన ఓ భారతీయ పర్యాటకుడికి చేదు అనుభవం ఎదురైంది.

తొలుత పులిని తీసుకుని కాస్త దూరం నడిచిన ఆ వ్యక్తి.. దాని శిక్షకుడి సూచన మేరకు దానిని పట్టుకుని ఫొటో దిగే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఆ ప్రయత్నం పులికి చిరాకు తెప్పించిందో ఏమో.. ఒక్కసారిగా అతనిపై దాడికి తెగబడింది(Tiger Attack Viral Video). కట్‌ చేస్తే..

సిద్ధార్థ శుక్లా(Sidharth Shukla) అనే వ్యక్తి తన ఎక్స్‌ ఖాతాలో ఈ ఘటన తాలుకా వీడియోను పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయ్యింది. అయితే అది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం అతను పేర్కొనలేదు. కామెంట్‌ సెక్షన్‌లో ఓ వ్యక్తి ఆ టూరిస్ట్‌ చిన్నచిన్న గాయాలతో బయటపడినట్లు తెలిపాడు.

ఈ ఘటనతో వన్యప్రాణ పర్యాటకంపై విమర్శలు వినవస్తున్నాయి. అసహజ వాతావరణంలో వాటి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి పర్యాటకుల విషయంలో నిర్లక్ష్యం తగదని ఫుకెట్‌ నిర్వాహకులను నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: వివేక్‌ రామస్వామి భార్యకు చేదు అనుభవం

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)