కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు
Breaking News
రష్యా వార్: ప్రమాదంలో ఇండియన్స్.. మోదీ సర్కార్ అలర్ట్
Published on Thu, 02/24/2022 - 15:33
కీవ్: ఉక్రెయిన్‌లో భీకర యుద్దం కొనసాగుతోంది. రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్‌పై బాంబులు, మిస్సెల్స్‌తో దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ దాడిలో ఇప్పటికే ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
కాగా, ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారత పౌరులకు, విద్యార్థులకు ఎంబసీ కీలక సూచనలు అందించింది. దాడులు కొనసాగుతున్న కారణంగా ఉక్రెయిన్ నుంచి అన్ని విమానాలు రద్దయ్యాయి. ప్రత్యేక విమానాలు సైతం రద్దు చేయబడినట్టు ఎంబసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీయులను తరలించేందుకు తాము ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిపింది. ప్రజల తరలింపునకు సంబంధించి ప్రణాళిక సిద్ధం కాగానే భారత ఎంబసీ సమాచారం అందిస్తుందని వెల్లడించింది.
(ఇది చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 18 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..)
ఈ క్రమంలోనే భారతీయులు వారి పాస్‌పోర్ట్, ఇతర అత్యవసర పత్రాలను ఎల్లప్పుడు తమ వద్దే భద్రపరుచుకోవాలని సూచించింది. భారత పౌరులు ఎంబీసీకి సంబంధించిన వెబ్‌సైట్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టులను ఫాలో అవుతూ ఉండాలని పేర్కొంది. ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపింది. కాగా, అంతకు ముందు భారత పౌరులు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని కోరింది. ఇళ్లు, హాస్టల్స్‌ను వీడి బయటకు రావద్దని హెచ్చరించింది.
@IndiainUkraine issues a fresh advisory for all Indian Nationals/Students in Ukraine.
— Arindam Bagchi (@MEAIndia) February 24, 2022
Alternative arrangements are being made for evacuation of our citizens.
📞 Additional 24*7 helplines:
+38 0997300428
+38 0997300483
+38 0933980327
+38 0635917881
+38 0935046170 pic.twitter.com/95EHCPSOKy
Tags : 1