Breaking News

రష్యా చమురుకు  భారత్‌ రాం రాం!

Published on Mon, 10/27/2025 - 02:43

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపేయాలని భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి అదే మాట మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ పూర్తిగా తగ్గిస్తోందని తెలిపారు. చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గిస్తోందని చెప్పారు. శనివారం తన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో మలేషియా వెళ్లూ మార్గమధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

దక్షిణకొరియాలో జరుగనున్న ఆసియా పసిఫిక్‌ ఆర్థిక సహకార సమాఖ్య (అపెక్‌) సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై నప్పుడు రష్యా చమురు గురించి కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. భారత్‌–పాక్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపాపనని మరోసారి చెప్పుకున్నారు. 

‘భారత్‌–పాక్‌ యుద్ధంతోపాటు మరికొన్ని యుద్ధాలను ఆపటం చాలా కష్టమని, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపటం చాలా తేలిక అని నేను భావించాను. కానీ, నా అంచనా తప్పింది. భారత్‌–పాక్‌ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నేను చేయాల్సిందంతా చేశాను. రష్యా– ఉక్రెయిన్‌ విషయంలో కూడా అదే వ్యూహం అమలుచేశాం. కానీ, ఆ రెండు దేశాధినేతల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పరస్పరం తీవ్రంగా అసహ్యించుకుంటారు’అని ట్రంప్‌ తెలిపారు.  
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)