Breaking News

భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా?

Published on Sun, 04/19/2026 - 14:22

న్యూఢిల్లీ: అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని అందుకే హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ క్రమంలో హర్మూజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నౌకలపై ఇరాన్‌ గన్‌ బోట్లు కాల్పులు జరిపాయి. దీంతో భారత్‌లో ఇంధన సరఫరా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 రోజుల వరకు చమురు, పెట్రోల్, డీజిల్,ఏటీఎఫ్‌ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్‌ జలసంధి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం మూసుకుపోతే సరఫరా అంతరాయం, రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

భారత్ గత కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రెడ్ సీ–సూయజ్ కాలువ మార్గం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తోంది. అదనంగా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది. 

ప్రస్తుతం భారత్‌కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్‌ఎన్‌జీ నిల్వలు, 40 రోజుల ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు వరకు ఉంది.

ప్రస్తుతం నిల్వలు ఉన్నప్పటికీ హర్మూజ్‌ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే భారత్‌కి ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సరఫరా ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)