Breaking News

ఉగ్రవాదుల వేటకు భారత్‌-నేపాల్‌ సంయుక్త ఆపరేషన్‌

Published on Sat, 05/24/2025 - 11:09

న్యూఢిల్లీ: భారత్‌-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్తానీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందిన దరిమిలా  ఇరు దేశాలు సంయుక్తంగా పెట్రోలింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. పాకిస్తానీ ఉగ్రవాదులను(Pakistani terrorists) గుర్తించేందుకు నేపాలీ దళాలతో కలిసి ఎస్‌ఎస్‌బీ అధికారులు భారత-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించారని ఇండియా టుడే పేర్కొంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం భారతదేశ సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ),నేపాల్‌కు చెందిన సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్‌)లు సరిహద్దుల్లోని దట్టమైన అడవులలో సంయుక్తంగా గాలింపు  చేపట్టాయని సమాచారం. భారత్‌-నేపాల్ 1,700 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఎస్‌ఎస్‌బీ కమాండెంట్ గంగా సింగ్  మీడియాతో మాట్లాడుతూ  తాము జరిపిన ఉమ్మడి పెట్రోలింగ్‌(Joint patrolling)లో నేపాల్ సైనికులు ఉగ్రవాదంపై పోరాటానికి తమతో సహకరించారని అన్నారు. నేపాలీ సైనిక దళాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రతి నెలా రెండు దేశాల సరిహద్దు దళాల సమన్వయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. నేపాల్‌ సైనికాధికారులు తమ నిఘా సమాచారాన్ని భారత్‌తో  పంచుకున్నారని, తాము కూడా వారితో సమాచారాన్ని షేర్‌ చేసుకున్నామన్నారు.

నేపాల్‌గంజ్ ప్రాంతంలో ఒక మర్కాజ్ (ఇస్లామిక్ సంస్థ) ఉందని, అక్కడనిర్వహించే కార్యక్రమాలకు పాకిస్తానీలు తరచూ వచ్చేవారని సింగ్‌ తెలిపారు. ఎస్‌ఎస్‌బీ దళాలు నేపాల్ సరిహద్దుల్లో వాచ్ టవర్ల నుండి నిఘా సారించాయని చెప్పారు. కాగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో నేపాల్ ప్రభుత్వం భారత్‌కు సంఘీభావం ప్రకటించింది. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ‘ఉగ్రవాదంపై పోరాటంలో నేపాల్ అందరితో కలిసి పనిచేస్తుందని’ పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతిచెందగా, వారిలో ఒక నేపాలీ జాతీయుడు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్‌

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)