Breaking News

Kenya: భారతీయులకు అలర్ట్‌

Published on Wed, 06/26/2024 - 07:22

న్యూఢిల్లీ: భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ కెన్యాలో ఉంటున్న భారతీయులకు అలర్ట్‌జారీ చేసింది. పన్నుల పెంపును నిరసిస్తూ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.

‘‘ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పరిస్థితి సద్దుమణిగే వరకు.. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు’’ అని కెన్యాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఎక్స్‌  ద్వారా సూచించింది. మరింత సమాచారం కోసం స్థానిక వార్త ఛానెల్స్‌ను, అలాగే.. దౌత్య సంబంధిత వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించింది.

ఇదిలా ఉంటే.. కెన్యాలో పన్నుల పెంపు చట్టానికి ఆ దేశ పార్లమెంట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే సమయంలోనే పార్లమెంట్‌ భవనం బయట  నిరసనలు కొనసాగాయి. ‘‘కెన్యా ఇంకా వలస పాలనలోనే మగ్గిపోతోందని.. తమ దేశాన్ని తాము రక్షించుకుని తీరతామని’’ నినాదాలు చేస్తూ వేల మంది యువత ఒక్కసారిగా చట్టసభలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 20 మంది దాకా గాయపడ్డారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ఇచ్చింది. అయితే ఈ సంఖ్యే ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.

ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సోదరి, కెన్యా ఉద్యమకారిణి అవుమా ఒబామా కూడా ఉన్నారు. టియర్‌గ్యాస్‌ దాడిలో ఆమె సైతం అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. 

ఏమిటీ బిల్లు..
కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్‌ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.  అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)