Breaking News

రష్యా, చైనాలతో భారత్‌కు పోలిక లేదు: ఫిన్లాండ్ అధ్యక్షుడు

Published on Wed, 09/24/2025 - 15:27

హెల్సింకి: భారతదేశం.. రష్యా, చైనాల మాదిరి కాదని..అదొక అభివృద్ధి చెందుతున్న సూపర్‌ పవర్‌ ​అని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను పరిష్కరించడంలో భారతదేశ భౌగోళిక, రాజకీయ పాత్రను, శాంతి చర్చలలో భాగస్వామ్యాన్ని ఆయన  వివరించారు. సాంకేతిక, వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్‌- ఫిన్లాండ్ సంబంధాలను బలోపేతం చేయడానికి  మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.

ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశ అభివృద్ధిని కొనియాడుతూ పాశ్చాత్య దేశాలు  ఆ దేశంతో మరింత సన్నిహితంగా మెలగాలని కోరారు. బ్లూమ్‌బెర్గ్ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారతదేశం, రష్యా, చైనా మధ్య పెరుగుతున్న సమన్వయంపై తన అభిప్రాయం  వ్యక్తం చేశారు. భారతదేశం అటు యూరోపియన్ యూనియన్‌కు, ఇటు యునైటెడ్ స్టేట్స్‌కు సన్నిహిత మిత్రదేశం. అందుకే రష్యా, చైనా దేశాల జాబితాలో భారత్‌ను చేర్చనన్నారు.  భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్. అందుకే పశ్చిమ దేశాలు భారతదేశంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని అన్నారు.
 

రష్యా- చైనా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయని  భావిస్తున్నానని, 1990ల ప్రారంభంలో చైనా-రష్యా ఒకే పరిమాణంలో ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు చైనా 10 రెట్లు వృద్ధి సాధించింది.  ఇప్పుడు రష్యా నుంచి చమురు,గ్యాస్ కొనుగోలు, సాంకేతిక మార్పిడితో పరస్పర సహకారం అందిస్తోంది. ఇది రష్యా యుద్ధ తంత్రానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే  ఆ దేశాల మధ్య దగ్గరి సంబంధం ఉన్నదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.

భారతదేశంతో ఇతర దేశాల భాగస్వామ్యం కోసం ఫిన్లాండ్ పిలుపు నివ్వడం ఇది మొదటిసారి కాదని, అంతకుముందు, హెల్సింకి సెక్యూరిటీ ఫోరం 2025లో కోరామన్నారు. తాను ఇటీవల ప్రధాని మోదీతో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడానని, తొలుత కాల్పుల విరమణ అవసరమని, ఆ తర్వాతనే శాంతి చర్చలను ప్రారంభించగలమని మోదీ పేర్కొన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు హాజరైన షాంఘై సహకార సంస్థ (ఎసీసీఓ)సమ్మిట్‌కు హాజరయ్యారని, ఆ సమయంలో వారి మధ్య స్నేహాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)