Breaking News

ట్రంప్‌ సుంకాలపై భారత్‌- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు

Published on Wed, 04/09/2025 - 08:03

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్‌- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా  అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్‌-చైనా) కలిసి  పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.

అయితే భారత్‌.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం  ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్‌ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.

ఇది ‍కూడా చదవండి: Dominican Republic: నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు
 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)