Breaking News

జంతువులా ఈడ్చుకెళ్లారు

Published on Sat, 01/17/2026 - 04:57

వాషింగ్టన్‌: అమెరికాలో ఒక మహిళను ఇమిగ్రేషన్‌ అధికారులు కారులోనుంచి బలవంతంగా బయటకు లాగి అరెస్టు చేసి, చేతులు పట్టుకొని బరబరా ఈడ్చుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అలియా రెహ్మాన్‌(42) అమెరికా పౌరురాలు. ఇక్కడే జన్మించారు. మిన్నెపొలిస్‌ నగరంలో నివసిస్తున్నారు. 

చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రామాటిక్‌ బ్రెయిన్‌ ఇంజూరీ సెంటర్‌లో చికిత్స కోసం ముందే అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. మంగళవారం కారులో అక్కడికి బయలుదేరారు. మధ్యలో ముఖాలకు మాస్క్‌లు ధరించిన ఇమిగ్రేషన్‌ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఆమె కూర్చున్నవైపు కారు అద్దం పగులగొట్టారు. సీటు బెల్ట్‌ను కట్‌ చేశారు. డ్రైవర్‌ సీటు గుండా ఆమెను బయటకు లాగారు. కాళ్లు చేతులు పట్టుకొని ఈడ్చుకెళుతూ తమ వాహనంలోకి ఎక్కించారు. 

డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని, వదిలిపెట్టాలని రోదిస్తూ వేడుకున్నా కనికరించలేదు. కనీసం చికిత్స అందించే ఏర్పాటు కూడా చేయలేదు. దాంతో బాధితురాలు చాలాసేపు          స్పృహ కోల్పోయారు. చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తాను ఇప్పటికీ బతికి ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అలియా రెహ్మానచెప్పారు. 

ఒక జంతువును ఈడ్చుకెళ్లినట్లుగా తనను ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. మిన్నెపొలిస్‌లో అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్‌ అధికా రులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వారిని గుర్తించడానికి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను డిటెన్షన్‌ కేంద్రాలకు తరలించి ప్రశి్నస్తున్నారు. మరోవైపు వలసదారులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)