Breaking News

ఇరాన్‌కు కొత్త టెన్షన్‌.. చైనా కరుణించేనా?

Published on Tue, 01/13/2026 - 08:42

టెహ్రాన్‌: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న వేళ ఖమేనీకి కొత్త టెన్షన్‌ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా ఇరాన్‌ను టార్గెట్‌  చేసి ఇజ్రాయెల్‌ ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ఐడీఎఫ్‌ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తమీర్ హేమాన్ ధృవీకరించారు. దీంతో, ఇజ్రాయెల్‌ దాడుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా తమీర్ హేమాన్ మాట్లాడుతూ.. ఇరాన్‌లో ఇటీవలి పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేసింది. గడిచిన రెండు వారాల్లో రెండు సార్లు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసే వరకు వెళ్లింది. కానీ, ఇరాన్‌పై అమెరికా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని దాడులు చేయలేదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికాతో చర్యలు ఇప్పటికే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు లేవు. ఇరాన్‌లో ఇప్పటికే ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి.

ఇక, ఇరాన్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. దీంతో, ఇరాన్‌ను ఇజ్రాయెల్‌ టార్గెట్‌ చేసినట్టు తెలిసింది.

మరోవైపు.. అమెరికా, ఇజ్రాయెల్‌ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్‌ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌.. చైనాను సాయం కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అంతకుముందు కూడా ఇరాన్‌కు చైనా సాయం అందించింది. గతేడాది ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా ఆయుధాలు పంపించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మూడు మిస్టరీ కార్గో విమానాలను టెహ్రాన్‌కు పంపినట్లు తెలిసింది. మూడు బోయింగ్‌-747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి టెహ్రాన్‌ వైపు వెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ మూడు విమానాలూ కజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్మెనిస్థాన్‌ వైపు నుంచి ఇరాన్‌ సమీపంలోని వెళ్లాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)