Breaking News

ఇజ్రాయెల్ భీకర దాడి: హమాస్ కీలక కమాండర్లు హతం!

Published on Wed, 07/15/2026 - 07:43

గాజా సిటీ: ఉత్తర గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) జరిపిన తాజా వైమానిక దాడిలో హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్లతో పాటు పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. హమాస్‌కు చెందిన ‘సెంట్రల్ జబాలియా బెటాలియన్’ మిలిటరీ సెక్యూరిటీ విభాగం అధిపతి మహమ్మద్ మర్వాన్ మహమ్మద్ సలేంను సైన్యం మట్టుబెట్టింది.

ఈ దాడిలో మహమ్మద్ సలేంతో పాటు హమాస్ సైనిక విభాగానికి చెందిన మరికొందరు కీలక ఉగ్రవాదులు కూడా మరణించినట్లు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. హతులలో సెంట్రల్ జబాలియా బెటాలియన్‌కు చెందిన నుఖ్బా ఉగ్రవాది, హమాస్ పోలీసు దర్యాప్తు విభాగం అధిపతి  అబ్దల్-మాలెక్ అబు అల్-జబిన్, అదే బెటాలియన్‌కు చెందిన యమన్ మహమ్మద్ జిబ్రిల్ ఉబైద్, అలాగే వెస్ట్రన్ జబాలియా బెటాలియన్ ఉగ్రవాది, హమాస్ పోలీస్ ఆపరేటివ్ ఘస్సాన్ అక్రమ్ సలామా దకాస్ ఉన్నారు.

గత కొన్ని నెలలుగా ఈ ఉగ్రవాదులంతా కలిసి ఇజ్రాయెల్‌పై భారీ ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని, ఆ ముప్పును ముందే తిప్పికొట్టేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం పేర్కొంది. కాగా ఈ వైమానిక దాడి సమయంలో సాధారణ పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ఐడీఎఫ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక ఆయుధాలను, వైమానిక నిఘా వ్యవస్థలను ఉపయోగించినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: ఇండియన్‌ సినిమాతో పాక్‌ థియేటర్లకు కాసుల పంట!

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)