Breaking News

వీడియో: 18వేల అడుగుల ఎత్తు! సెల్ఫీ తీయబోతే పట్టు తప్పి..

Published on Tue, 10/07/2025 - 08:05

సెల్ఫీ మోజు.. ఓ పర్వతారోహకుడి ప్రాణం బలి తీసుకుంది(Selfie Death). ఏకంగా 18వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆ వ్యక్తి పెద్ద పొరపాటు చేశాడు. తోటి బృందంతో సెల్ఫీ కోసమని కట్టుకున్న తాడును విప్పదీసుకున్నాడు. అదే.. అతని మరణానికి కారణమైంది. 

చైనా సిచువాన్‌లోని మౌంట్ నామా(Mount Nama)  శిఖరంపై(ఎత్తు: 5,588 మీటర్లు.. సుమారుగా 18,300 అడుగులు) ఓ బృందం ట్రెక్కింగ్‌ చేస్తోంది. ఆ సమయంలో ఓ హైకర్‌.. సేఫ్టీ రోప్‌ను విప్పేసి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పి దొర్లుకుంటూ పడిపోయాడు. అలా.. 200 మీటర్లు(656 మీటర్లు) జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో తోటి బృందంలోని సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.

మృతుడ్ని 31 ఏళ్ల హాంగ్‌గా గుర్తించారు. రక్షణ బృందాలు అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. అతికష్టం మీద స్వాధీనం చేసుకున్న హాంగ్‌ మృతదేహాన్ని.. గోంగ్గా మౌంటెన్‌ టౌన్‌కు తరలించారు. సెల్ఫీ కోసం తన సేఫ్టీ రోప్ తీసేయడం.. ఐస్ యాక్స్ లేకపోవడంతో కాళ్లకు ఉన్న క్రాంపాన్ బూట్లు మంచుపై జారి ఈ ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హంగ్‌ మంచు కొండలు ఎక్కడం ఇదే తొలిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకోగా, వీడియో సోషల్ మీడియాలోMount Nama Viral Video వైరల్ అవుతోంది.

 

 ఇదిలా ఉంటే.. హంగ్‌తో పాటు వెళ్లిన బృందం ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే అతను ప్రొఫెషనల్‌ కాదని, అరుదుగా కొండలెక్కిన అనుభవం మాత్రమే ఉందని సిచువాన్‌ మౌంటెనీరింగ్‌ అసోషియేషన్‌ అంటోంది.

ఇదీ చదవండి: మీరు తినగా వదిలేసిన ఆహారం ఏమవుతుందో తెలుసా?

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు