Breaking News

ఉంగరంతో ప్రపోజ్‌ చేద్దామనుకున్నాడు, ఈలోపే..

Published on Thu, 05/22/2025 - 16:54

చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు.  ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.

యారోన్‌, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో  ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!

యారోన్‌, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్‌ చేయాలని యారోన్‌ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్‌ రాయబారి యెచెయిల్‌ లెయిటర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్‌ రోడ్జిగూజ్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. 

ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)