Breaking News

H-1B వీసాలు ట్రంప్‌ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరు

Published on Wed, 11/19/2025 - 14:24

అమెరికా అధ్యక్షుడిగా  డొనాల్ట్‌ ట్రంప్‌  రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత  భారత ఐటీ కంపెనీలకు, ఐటీ  నిపుణులకు భారీ ఎదురుదెబ్బ గిలింది.  2025 ఆర్థిక సంవత్సరంలో  H-1B వీసా దరఖాస్తులను భారతీయ కంపెనీలు గణనీయంగా తగ్గించేశాయి. బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గాయి. మరోవైపు ఈ పరిణామం అమెరికా ఉద్యోగులను నియామకాలకు దారి తీస్తోంది.  శరవేగంగా మారుతున్న సాంకేతిక మార్పులు, భారతదేశం నుండి రిమోట్‌గా ప్రాజెక్టులను అమలు చేసే సామర్థ్యం పెరుగుదలను ప్రతిబింబిస్తుందని నిపుణులు తెలిపారు.

గత దశాబ్ద కాలంతో పోలిసతే ఇది మరింత తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉంది; టాప్ ఏడు భారతీయ సంస్థలు H-1B అ‍ప్లికేషన్స్‌ను 70శాతం తగ్గించాయి. 2025లో,  కేవలం 4,573 ప్రారంభ ఉపాధి (initial employment) ఆమోదాలను మాత్రమే పొందారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు H-1B వినియోగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. USCIS డేటా  NFAP విశ్లేషణ ప్రకారం, అమెజాన్ 4,644 ప్రారంభ ఆమోదాలతో టాప్‌లో ఉండగా,  మెటా (1,555), మైక్రోసాఫ్ట్ (1,394), గూగుల్ (1,050) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆపిల్ ఆరో స్థానంలో నిలిచింది. నాలుగు అమెరికన్ టెక్ కంపెనీలు తొలి నాలుగు స్థానాలను ఆక్రమించడం ఇదే మొదటిసారి.

చదవండి: ఎనిమిదేళ్లనాటి దారుణ హత్యలు : క్లూ ఇచ్చిన ల్యాప్‌ట్యాప్‌

భారతీయ ఐటీ సంస్థలు  టాప్‌ నుంచి కిందికి పడిపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మొత్తం మీద ఐదో  స్థానంలో నిలిచింది, కానీ LTIMindtree (20వ స్థానం), HCL అమెరికా (21వ స్థానం) టాప్ 25లో చోటు దక్కించుకోలేకపోయాయి. దీనికి ఐటీలో  నిర్మాణాత్మక మార్పులు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆన్‌షోర్ ఉద్యోగులు ,రిమోట్ ఎగ్జిక్యూషన్ మోడల్‌లపై సంస్థలు ఎక్కువగా ఆధారపడుతున్నాయన్నారు.  ట్రంప్   కొత్త వీసావిధానం, ప్రతీ కొత్త H-1B కోసం 100,000 డాలర్ల  ఫీజు లాంటి వాటికారణంగా కంపెనీల దృక్పథంలో మరింత మార్పువస్తుందని భావిస్తున్నారు.

అత్యధిక H-1B వీసాలు ఇక్కడే 
ఇనీషియల్‌ ఎంప్లాయ్‌మెంట్‌  కోసం 21,559 దరఖాస్తులతో H-1B వీసాల ఆమోదాల జాబితాలో కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉంది, తరువాత టెక్సాస్ (12,613), న్యూయార్క్ (11,436), న్యూజెర్సీ (7,729),  వర్జీనియా (7,579) ఉన్నాయి.

న్యూయార్క్ నగరం అత్యధిక సంఖ్యలో కొత్త ఆమోదాలను (7,811) నమోదు చేసింది, ఆర్లింగ్టన్, చికాగో, శాన్ జోస్, శాంటా క్లారా, శాన్ఫ్రాన్సిస్కో కూడా ప్రముఖ నగరాలుగా ఉన్నాయి. ప్రొఫెషనల్ , టెక్నికల్ సర్వీసెస్, విద్య, తయారీ, సమాచారం, ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ వంటి రంగాలలో  H-1B వీసాలకు ప్రాధాన్యత లభించింది. 

ఇదీ చదవండి: BMW కారు బీభత్సం : భారత సంతతి గర్భిణి దుర్మరణం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)