Breaking News

నా స్నేహితుడు, మంచి మనిషి: మోదీపై ట్రంప్‌ ప్రశంసలు

Published on Thu, 10/10/2024 - 08:51

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడని, మంచి మనిషి అని కొనియాడారు. ఈ మేరకు ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రంపచ నాయకుల గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘మోదీ నాకు స్నేహితుడు. మంచి మనిషి. ఆయన ప్రధానిగా  బాధ్యతలు స్వీకరించక ముందువరకు భారత్ పరిస్థితి అస్థిరంగా ఉండేది. చూడటానికి అతను మీ తండ్రిలా కనిపిస్తాడు. చాలా మంచివాడు. అని అన్నారు.

ఈ క్రమంలోనే 2019 సెప్టెంబరులో అమెరికాలోని టెక్సాస్‌ వేదికగా నిర్వహించిన ‘హౌడీ మోదీ’కార్యక్రమాన్ని ట్రంప్‌ గుర్తుచేసుకున్నారు. అప్పటి ఈ కార్యక్రమానికి  విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 80 వేలమంది వచ్చారని, అది ఎంతో ఉత్సాహంగా సాగిందని చెప్పారు. మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్‌ చెప్పారు. కాగా హ్యూస్టన్ నగరంలోని ఎన్‌ఆరజీ స్టేడియంలో జరిగిన ఈ  ఈవెంట్‌క పెద్ద సంఖ్యలో భారతీయ-అమెరికన్‌లు హజరవ్వగా వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించి మోదీతో జరిపిన సంభాషణను ప్రస్తావిస్తూ..‘కొన్ని సందర్భాల్లో భారత్‌ను బెదిరించేందుకు ఓ దేశం యత్నించింది. ఇలాంటి వ్యవహారాలను చక్కబెట్టడంలో నాకు అనుభవం ఉందని, ఈ విషయంలో సాయం చేస్తానని మోదీతో చెప్పాను. దానికి ఆయన చాలా దూకుడుగా స్పందించారు. ‘ఈ వ్యవహారాన్ని నేను చూసుకోగలను. అవసరమైతే ఏ చర్యలు తీసుకునేందుకైనా సిద్ధమే. వందల సంవత్సరాలుగా వారిని మేము ఓడించాం’ అని మోదీ అన్నారు. ఇది విన్న నేను ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)