Breaking News

కార్చిచ్చుకు తోడైన వడగాడ్పులు

Published on Wed, 07/29/2026 - 05:04

పారిస్‌: ఫ్రాన్స్, స్పెయిన్‌లలో వడగాడ్పులు కొనసాగుతుండటంతో కార్చిచ్చు మరింత తీవ్ర రూపం దాల్చింది. రెండు దేశాల్లో ఇప్పటి వరకు కనీసం 3.30 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అట్లాంటిక్‌ తీరం వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాల్లోని సుమారు 4 వేల మందిని ఖాళీ చేయించినట్లు ఫ్రాన్స్‌ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 2.20 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సుమారు 420 చదరపు కిలోమీటర్ల మేర మంటల్లో దహించుకుపోగా, మంటలు మరింతగా వ్యాపించకుండా ప్రస్తుతానికైతే అదుపు చేయగలిగామన్నారు. 

వేసవి తీవ్రత, పొడి వాతావరణం పెరుగుతుండటంతో కార్చిచ్చు ప్రమాదం పూర్తిగా తొలిగిపోనట్లేనని వారు తెలిపారు. ముందు జాగ్రత్తగా, లకనౌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లోని క్యాంపుసైట్లు, హాలిడే విలేజెస్, టూరిస్ట్‌ నివాసాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నామన్నారు. మంటలను అదుపు చేసే విధుల్లో ఇప్పటివరకు 93 మంది ఫైర్‌ ఫైటర్లు గాయపడ్డారన్నారు. అదేవిధంగా, స్పెయిన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కార్చిచ్చు వ్యాపిస్తోందని ప్రభుత్వం తెలిపింది. వడగాడ్పులు కొనసాగుతుండటంతో మంటలు కూడా విస్తరిస్తున్నాయని, వాటిని నిలువరించేందుకు మిలటరీ ఎమెర్జెన్సీ విభాగాల సాయంతో వందలాదిమంది ఫైర్‌ ఫైటర్లు నిరంతరం శ్రమిస్తున్నాయని వెల్లడించింది. అధికారులు ఇప్పటి వరకు 79 వేల మందిని ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

మరో 30 వేల మందిని ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేశారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో మొట్టమొదటి సారిగా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. రాజధాని మాడ్రిడ్‌కు పశి్చమాన భారీ కార్చిచ్చు ఒకటి విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతోపాటు, కస్టెల్లోన్‌లో మంటల వ్యాప్తితో పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు. కొండప్రాంతం అవిలాలో రికార్డు స్థాయిలో మంటలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మంటలు 500 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని భస్మీపటలం చేశాయని అధికారులు తెలిపారు. ఇంతటి తీవ్ర స్థాయిలో కార్చిచ్చును ఇప్పటి వరకు తాము చూడలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)