Breaking News

‘ఫ్లై దుబాయ్’ వీరుడికి అరుదైన గౌరవం!

Published on Sun, 10/04/2026 - 00:54

ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం లభిచింది. కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌పై  ప్రశంసలు కురిపించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఆయనను ఇజ్రాయెల్, భారత్‌తో పాటు ప్రపంచానికే హీరోగా అభివర్ణించారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జ్యోతి వెలిగించాలని ఆహ్వానించారు.

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం ఎఫ్‌జెడ్‌1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి, విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విమానం కొద్ది సమయంలోనే వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది. ఈ పరిస్థితిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు వీలైంది. విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు పరిస్థితిని చక్కదిద్ది, సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో విమానంలోని 174 మంది ప్రాణాలు కాపాడిన కెప్టెన్ మచ్చర్ ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయన ధైర్యాన్ని కొనియాడారు.

ఈ నేపథ్యంలో కెప్టెన్ మచ్చర్‌తో మాట్లాడిన నెతన్యాహు, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జ్యోతి వెలిగించేందుకు రావాలని ఆహ్వానించారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)