Breaking News

విమానాన్ని కూల్చడమే నా లక్ష్యం

Published on Mon, 10/05/2026 - 05:37

దుబాయ్‌: ఫ్లై దుబాయ్‌ విమానంలో భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌పై దాడి చేసిన కో–పైలట్, ఒమన్‌ జాతీయుడైన హమామ్‌ అల్‌–హమామీ మనసులో పెద్ద కుట్రే ఉన్నట్లు స్పష్టమైంది. ఆ విమానాన్ని కూల్చడమే తన లక్ష్యమని విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రిక తన కథనంలో పేర్కొంది. చావుకు భయపడలేదని అతను వ్యాఖ్యానించాడు. కోపైలట్‌ను యూఏఈ అధికారులు భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దాడి తర్వాత విమానం అత్యవసరంగా సౌదీ అరేబియాలో ల్యాండైన సంగతి తెలిసిందే. నిందితుడిని అక్కడే అదుపులోకి తీసుకొని యూఏఈకి తరలించారు.


 కో–పైలట్‌ హమామీ ఒమన్‌ దేశస్థుడైన తండ్రికి, సిరియా దేశస్థురాలైన తల్లికి జని్మంచాడు. చాలా ఏళ్లు దుబాయ్‌లో నివసించాడు. సిరియాలో అంతర్యుద్ధ జరుగుతున్న సమయంలో అక్కడ కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఇస్లామిక్‌ తీవ్రవాదం పట్ల ఆకర్శితుడైనట్లు తెలుస్తోంది. అతడి సోషల్‌ మీడియా ఖాతాలను దర్యాప్తు అధికారులు జల్లెడ పడుతున్నారు. అతడు తొలగించిన ‘ఎక్స్‌’ ఖాతాలోని 3,000కు పైగా పోస్టుల స్క్రీన్‌షాట్‌లు ఇంటర్నెట్‌ ఆర్కైవ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలోని అనేక పోస్టులు ఇస్లామిక్‌ భావజాలానికి సంబంధించినవే ఉన్నాయి.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)