Breaking News

టెహ్రాన్‌ను తక్షణం ఖాళీ చేయాలి: ట్రంప్‌ హెచ్చరిక

Published on Tue, 06/17/2025 - 07:59

వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రస్థాయికి చేరాయి.  ఈ నేపథ్యంలో టెహ్రాన్‌(ఇరాన్‌)లోని పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, వెళ్లిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.  అదే సమయంలో ఆయన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనంటూ పునరుద్ఘాటించారు. పరిస్థితి  మరింత దిగజారకముందే ఇజ్రాయల్‌తో  ఏర్పడే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఇప్పడు ఇరాన్‌కు మరో అవకాశం ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిని ఆయన తన ‘ట్రూత్‌ సోషల్’‌లో పోస్టు చేశారు.

ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధం మరింత తీవ్రమయ్యేందుకు దారితీసేలా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమావేశంలో పాల్గొన్న డొనాల్డ్‌ ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధంపై స్పందించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందన్న ట్రంప్, అక్కడి  ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా యుద్ధం ముగించాలంటే ఇరాన్ సుప్రీం నేత  ఖమేనీని  అంతం చేయాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
 

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్‌పై  ఇరాన్‌ వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పై దాడులు చేసింది. టెహ్రాన్ గగనతలంపై తమ ఆధిపత్యం  కొనసాగుతున్నదని ఇజ్రాయెల్ పేర్కొంది. తాము ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఇంతలోనే ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఇది కూడా చదవండి: ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)