Breaking News

ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులిచ్చిన దుబాయ్‌ యువరాణి

Published on Wed, 07/17/2024 - 15:43

అబుదాబీ: దుబాయ్‌ యువరాణి షేఖా మహ్రా బింట్‌(30) సంచలన ప్రకటన చేశారు. తన భర్తకు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ట్రిపుల్‌ తలాక్‌తో విడాకులు ఇస్తున్నట్లు పోస్ట్‌ చేశారు. అంతేకాదు విడాకులకు కారణాలేంటో కూడా ఆమె ఆ సందేశంలో ఉంచారు.

షేఖా మహ్రాకు దుబాయ్‌లో ప్రముఖవ్యాపారవేత్త అయిన షేక్‌ మనా బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌​ బిన్‌ మనా అల్‌ మక్తూమ్‌(30)తో కిందటి ఏడాది మేలో వివాహం జరిగింది. రెండు నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. అయితే.. వీళ్లు విడిపోతున్నారనే ప్రచారం ముందు నుంచే కొనసాగుతోంది. 

రెండు వారాల కిందట కన్నకూతురితో ఓ ఫొటోను ఉంచిన దుబాయ్‌ యువరాణి.. ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్‌ ఉంచింది. ఆ టైంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చాలామంది గమనించారు. అలాగే.. ఫొటోలను సైతం డిలీట్‌ చేసుకోవడంతో విడిపోతున్నారనే చర్చా మొదలైంది.

అయితే.. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ విడాకుల ప్రకటన చేశారామె. తాజా ఇన్‌స్టా పోస్టులో.. ‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున నేను మన విడాకుల్ని ప్రకటిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య.. అంటూ మూడుసార్లు విడాకులంటూ(తలాఖ్‌) రాసుకొచ్చారామె.

 

దుబాయ్‌ పాలకుడు, యూఏఈ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్‌ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తనయ షేఖా మహ్రా. యూఏఈలో మహిళా హక్కుల సాధన కోసం న్యాయవాదిగా ఆమె తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా విడాకుల ప్రకటన, అదీ భార్యగా సోషల్‌ మీడియా ద్వారా ట్రిపుల్‌ తలాఖ్‌ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)