Breaking News

ఇజ్రాయెల్‌ ప్రధాని ఇంటిపై డ్రోన్‌ దాడి.. తప్పిన ప్రమాదం

Published on Sat, 10/19/2024 - 14:07

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌ దళాలు తమ వరుస దాడులతో హమాస్‌,హెజ్‌బొల్లా అగ్ర నేతలను ఒక్కొక్కరిగా హతమార్చుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హమాస్‌ చీఫ్‌, అక్టోబర్‌ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. గాజాలోని ఓ ఇంటిపై చేసిన దాడిలో సిన్వర్‌ మరణించినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించిన రెండు రోజులకే ఓ ఆందోళనకర ఘటన చోటుచేసకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్‌ దాడి జరిగినట్లు వార్తా  కథనాలు వెలువడుతున్నాయి.

లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ శనివారం దక్షిణ హైఫాలోని సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. ఈ డ్రోన్ దాడిలో భవనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

కాగా లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్‌లను ఇజ్రాయెల్‌ వాయు దళాలు టెల్ అవీవ్ ప్రాంతంలో కూల్చివేశాయి. అయితే మూడోది మాత్రం సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఎగిరిందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)