Breaking News

డ్రోన్‌ వెంటాడింది.. చేతులు జోడించినా కనికరించలేదు!

Published on Wed, 08/05/2026 - 13:23

ఉక్రెయిన్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు విక్రయిస్తున్న ఓ సాధారణ పౌరుడిని డ్రోన్‌ వెంటాడి దాడి చేసిన వీడియోను ఉక్రెయిన్‌ విడుదల చేసింది. చేతులు జోడించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా.. డ్రోన్‌ అతడిని వెంబడించింది. చివరకు అతని మీద పడిపోయి పేలినట్లు వీడియోలో కనిపిస్తోంది.

వీడియోలో ఓ వ్యక్తి వీధిలో పరుగులు తీస్తూ డ్రోన్‌ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. డ్రోన్‌ అతడిని చుట్టుముట్టి వెంటాడగా.. అతడు ఓ వాహనం చుట్టూ తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు డ్రోన్‌ అతడి సమీపంలో పేలినట్లు కనిపించింది. ఈ దాడిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది. అయితే అతడికి గాయాలయ్యాని.. ఆ షాక్‌ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాడని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

ఈ ఘటనను ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం యుద్ధ నేరమని పేర్కొంది.ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఇది రష్యా డ్రోన్‌ దాడికి నిదర్శనమని ఆరోపించారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే ఇది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. 

ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా దీనిని “కిరాతక చర్య”గా అభివర్ణిస్తూ.. పౌరులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై రష్యా ఇంకా స్పందించలేదు. 

యుద్ధ ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. సాంకేతిక ఆయుధాలు సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా ఉక్రెయిన్‌ రష్యా భూభాగంలో జరిపిన దాడుల్లో.. చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు పౌరులపై దాడుల ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Videos

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)