Breaking News

మోదీ గొప్పే.. కానీ పనులే నచ్చడం లేదు: ట్రంప్‌

Published on Sat, 09/06/2025 - 07:37

భారత్‌తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను కోల్పోయామని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా నాలుక మడతేసేశారు. నిజంగా అలాంటిదేమీ జరగలేదని భావిస్తున్నాను అంటూ ట్రంప్‌ గత వ్యాఖ్యలను తిరస్కరించారు.  

స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రక్షణశాఖ పేరును యుద్ధశాఖగా మారస్తూ అధికారిక ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేనెప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటా. మోదీ గొప్ప ప్రధానమంత్రి. కానీ, ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్‌తో మాకు ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదించాయి’’ అని ట్రంప్‌ అన్నారు. 

భారత్ రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేస్తుండటం నన్ను నిరాశపరిచింది. నేను వారికి ఇది తెలియజేశాను అని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించినట్లు ట్రంప్ తెలిపారు. అయినా కూడా ప్రధాని మోదీతో తన సంబంధాలు మంచి స్థాయిలో ఉన్నాయన్నారు. 

ఇదిలా ఉంటే.. చైనా టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్, రష్యా, చైనా అధినేతలు కలిసికట్టుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ‘‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయాం’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ట్రంప్ సీనియర్ కౌన్సిలర్ పీటర్ నవారో భారత్‌పై విమర్శలు చేశారు. రష్యా చమురు కొనుగోలుతో లాభాలు పొందుతున్నదని, భారత టారిఫ్‌లు అమెరికన్ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తున్నాయని ఆరోపించారు. 

ఇంకోవైపు.. అమెరికా వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ కూడా భారత్ రష్యా చమురు కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్య సంబంధిత అంశమని భావిస్తున్నాం. త్వరలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాం’’ అని పేరొన్నారు. అయితే.. తాజాగా తన వ్యాఖ్యలను ట్రంపే తోసిపుచ్చడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించడం లేదు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య అంశాలపై భారత్ చర్చలు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. భారత్-రష్యా సంబంధాలను మూడో దేశం దృష్టికోణంలో చూడకూడదని భారత ప్రభుత్వం అంటోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)