Breaking News

ఛీ.. ఈ చెత్త ఏంటి? అసహ్యమేస్తోంది.. ఎందుకిలా చేశారు?: ట్రంప్‌ ఫైర్‌

Published on Wed, 10/15/2025 - 07:13

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సంతోషం వచ్చినా.. కోపం వచ్చినా అస్సలు ఆగరు. తాజాగా టైమ్‌ మ్యాగజైన్‌ ఆయన్ని పొడుగుతూ ఓ కథనం ఇచ్చింది. అయినా కూడా ట్రంప్‌కు బాగా కోపం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

 టైమ్‌ మ్యాగజైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంత సోషల్‌ మీడియా సోషల్‌ ట్రూత్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు(Trump Angry On Time Magazine). కవర్‌ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఆయన ఆ పోస్టులో ఏమన్నారంటే.. 

నా గురించి వచ్చిన కథనం కొంతవరకు బాగానే ఉంది. కానీ కవర్‌పై ఉన్న ఫోటో మాత్రం చరిత్రలోనే చెత్త ఫోటో. వాళ్లు నా జుట్టును కనిపించకుండా చేశారు. నా జుట్టును తలపై చిన్న తలపాగా.. ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. నాకు ఎప్పుడూ కింది యాంగిల్‌ నుంచి తీసే ఫోటోలు నచ్చవు. ఇది మాత్రం చాలా చాలా చెత్త ఫొటో. అందుకే దీన్ని తప్పక విమర్శించాలి. అసలు వాళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?’’ అంటూ ట్రంప్‌ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు. 

ఇదిలా ఉంటే టైమ్‌ మ్యాగజైన్‌ను ట్రంప్‌ కోపడ్డడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్‌ చీఫ్‌గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్‌లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను ప్రచురించింది. ట్రంప్‌ ఆ ఫొటోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టైమ్‌ మ్యాగజైన్‌ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ వెటకారం ప్రదర్శించారు. అదే సమయంలో.. అయితే మస్క్ పని తీరును ఆ సమయంలో ఆయన ప్రశంసించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రంప్‌ మీద టైమ్‌ మాగజైన్ His Triumph అనే శీర్షికతో కవర్ పేజీ ఇచ్చింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది. ఈ ఒప్పందంతోనే 20 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్‌ విడుదల చేయగా.. ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను, 360 మంది పాలస్తీనీయుల మృతదేహాలను విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఏడాదిలోనే తాను పలు యుద్ధాలను ఆపానంటూ ట్రంప్‌ నోబోల్‌ శాంతి బహుమతి డిమాండ్‌ చేయగా.. రూల్స్‌ అడ్డురావడంతో ఆయన కల నెరవేరలేదు!. దీంతో వచ్చే  ఏడాదైనా దక్కవచ్చనే ఆశ పెట్టుకున్నారాయన.

ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఇంత భజనా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)