Breaking News

టారిఫ్‌లు సబబే: ట్రంప్‌ 

Published on Sun, 04/06/2025 - 06:26

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకున్నారు. వాటి ఫలితాలు చరిత్రాత్మకంగా ఉంటాయని చెప్పుకున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార సుంకాల నేపథ్యంలో శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా ఇక ఎంతమాత్రమూ మౌనంగా, నిస్సహాయంగా ఉండబోదని కుండబద్దలు కొట్టారు. ‘‘అమెరికాను చైనా సుంకాలతో గట్టిగా దెబ్బ కొట్టింది. నిజానికి మాపై చైనా సుంకాలతో పోలిస్తే ఆ దేశంపై నేను విధించిన టారిఫ్‌ ఏ మూలకూ కాదు. చాలా దేశాలు అమెరికా పట్ల ఇంతకాలం ఇలాగే వ్యవహరించాయి. 

ఇది ఇకపై సాగదు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాలు, వ్యాపారాలను అమెరికాకు తిరిగి తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఐదు లక్షల డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అవి మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక విప్లవంలో మనం గెలుస్తాం. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదు. ఈ పునరుద్ధరణకు అమెరికన్లు సహకరించాలి. సమస్యలను తట్టుకొని నిలబడగలగాలి. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం’’అని తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. తమ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 


 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)