Breaking News

‘మదురో అరెస్టు’ బహుమతి రెట్టింపు 

Published on Sat, 08/09/2025 - 06:37

వాషింగ్టన్‌: వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి రూ.438 కోట్లు బహుమానంగా ఇస్తామని అమెరికా ప్రకటించింది.  మదురోను ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్‌ స్మగ్లర్‌గా అభివర్ణించింది. గతంలో రూ.250 కోట్లుగా ఉన్న బహుమతిని మళ్లీ పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ ప్రకటించారు. మదురోకి డ్రగ్స్‌ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలున్నాయని ఆమె ఆరోపించారు. 

మదురో, అతని సహచరులతో సంబంధం ఉన్న 30 టన్నుల కొకైన్‌ను డ్రగ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అడ్మిని్రస్టేషన్‌ (డీఈఏ) స్వా«దీనం చేసుకుందని, అందులో 7 టన్నులు మదురోకి చెందినవని అన్నారు. ఈ ఆరోపణలను వెనిజులా విదేశంగ మంత్రి ఇవాన్‌ గిల్‌ ఖండించారు. బహుమతి ప్రకటనను రాజకీయ ప్రచారంగా  అభివరి్ణంచారు. తమ దేశ గౌరవం అమ్మకానికి లేదన్నారు. జెఫ్రీ ఎపిస్టీన్‌ కేసు వ్యవహారంలో విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే బోండీ ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు.  

మొదటి పదవీకాలం నుంచే..  
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మదురోపై చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. తన తొలి పదవీకాలంలోనే మదురో, పలువురు ఉన్నతాధికారులపై డ్రగ్‌ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, అవినీతి ఆరోపణలు మోపారు. మదురో కొలంబియా రెబెల్‌ గ్రూప్‌ ‘ఫార్క్‌’తో కలిసి కొకైన్‌ను అమెరికాకు పంపేందుకు ప్రయతి్నంచారని ఆరోపించారు. ఆ సమయంలో మదురో అరెస్టుకు రూ.150 కోట్ల బహుమతిని ప్రకటించారు. బైడెన్‌ పాలనలో ఆ మొత్తాన్ని 250 కోట్లకు పెంచింది. 2024 జూలై 29న వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్‌ మదురో గెలిచారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌పై విజయం సాధించారు.

 మూడోసారి అధ్యక్షపీఠాన్ని అధిష్టించారు. బస్సు డ్రైవర్‌ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన మదురో వివాదాస్పదంగా నిలిచారు. హ్యూగో చావెజ్‌ మరణం తరువాత 2013లో యునైటెడ్‌ సోషలిస్టు పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అమెరికా వెనిజులాపై ఆంక్షలు విధించింది. మదురోను అధ్యక్షుడిగా తిరస్కరించింది. అమెరికాతోపాటు యురోపియన్‌ యూనియన్, యూకే కూడా వెనిజులా చర్యలను ఖండించాయి. తమ దేశంలో తవ్వకాలు జరిపేందుకు అమెరికా చమురు దిగ్గజం చెవ్రాన్‌ను అనుమతించడంతో వెనిజులాపై కొన్ని ఆంక్షలను సడలించింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)