Breaking News

మోదీ గొప్ప వ్యక్తి.. కిల్లర్‌ 

Published on Thu, 10/30/2025 - 05:47

టోక్యో/సియోల్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి తన వాచాలత్వం ప్రదర్శించారు. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మోదీ చాలా మంచి మనిషి, చక్కగా, అందంగా కనిపించే నాయకుడు అంటూనే ఆయనొక కిల్లర్, నరకం లాంటి కఠినమైన వ్యక్తి అంటూ ఆక్షేపించారు. మనం ఎలాంటి మంచి తండ్రి కావాలని కోరుకుంటామో సరిగ్గా అలా కనిపించే వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యానించారు. మూడు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ఉదయం జపాన్‌ నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. గెయింగ్జూలో ఆసియా–పసిఫిక్‌ ఆర్థిక సహకార(అపెక్‌) సీఈఓ సదస్సులో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఆయన గొప్ప మిత్రుడు అంటూ ప్రశంసించారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, అందుకోసం వాణిజ్యం అనే అస్త్రం ప్రయోగించానని మరోసారి వెల్లడించారు. భారత్‌–పాక్‌ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత మోదీతో ఫోన్‌లో మాట్లాడానని, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకొనే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పానని వివరించారు. పాకిస్తాన్‌తో యుద్ధం ప్రారంభించారంటూ మోదీని మందలించానని అన్నారు. వాణిజ్య ఒప్పందం ఉండదని కచ్చితంగా చెప్పడంతో భారత్‌ దారికొచ్చిందని, పాక్‌పై దాడులు నిలిపివేసిందని  స్పష్టంచేశారు.  

కొత్త, అందమైన యుద్ధ విమానాలు ధ్వంసం  
దక్షిణ కొరియాకు బయలుదేరడానికి ముందు ట్రంప్‌ జపాన్‌ రాజధాని టోక్యోలో వ్యాపారవేత్తలతో విందు కార్యక్రమంలో మాట్లాడారు. భారత్, పాక్‌ మధ్య యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేశానని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌కు నష్టం వాటిల్లిందని పరోక్షంగా స్పష్టంచేశారు. ‘‘ఏడు నూతన, అందమైన యుద్ధ విమానాలు నేలకూలాయి. రెండు  అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధంలో అవి ధ్వంసమయ్యాయి’’ అని తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)