Breaking News

భారత్‌కు ట్రంప్‌ మరోసారి భారీ షాక్‌!

Published on Wed, 09/03/2025 - 21:42

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఉత్పత్తుల విభాగంలో 50శాతం టారిఫ్‌ను విధించారు. ఇప్పుడు అదే బాటలో సేవల విభాగంపై టారిఫ్‌లు విధించేందుకు సిద్ధమైంది. 
 
వాణిజ్య పరంగా భారత్‌పై మరింత ఒత్తిడి తెచ్చేలా ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు భారత ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్లపై సుంకాలు విధింనుంది. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సలహాదారు పీటర్ నవారూ.. అన్ని ఔట్‌సోర్సింగ్ సేవలపై టారిఫ్‌ విధించాలి’ అనే అభిప్రాయం వ్యక్తం చేయడం అందుకు బలం చేకూర్చుతోంది. దీంతో విదేశీ సేవలపై కూడా వస్తువుల్లాగే టారిఫ్ విధించాలి అనే ఆలోచనలో ట్రంప్‌ ప్రభుత్వం ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

ఈ విధానాలు అమలైతే అమెరికా కంపెనీలు ఔట్‌సోర్సింగ్ ఖర్చులు పెరగడంతో.. భారత్‌ సంబంధిత కంపెనీలతో కుదుర్చుకునే కాంట్రాక్ట్‌ల విషయంలో వెనక్కితగ్గుతాయి. ప్రాజెక్టుల ఆలస్యం, లాభాల తగ్గుదల, సరఫరా గొలుసుల అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారత ఐటీ కంపెనీలు అమెరికా ఆధారిత వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లే ఇంజినీర్లు, కోడర్లు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు ఎక్కువ మంది వెళుతుంటారు. ఇన్ఫోసిస్‌,టీసీఎస్‌,విప్రో,హెచ్‌సీఎల్‌ వంటి సంస్థలు హెచ్‌1బీ వీసాల ప్రధాన స్పాన్సర్లు. ఈ వీసాల ద్వారా అమెరికాలో పనిచేసే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడు..హెచ్‌1బీ వీసా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ పరిణామాలు భారత్‌ తన ఐటీ రంగాన్ని విస్తరించేందుకు,వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచేందుకు, అమెరికా ఆధారాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ పాలనలో భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య దృశ్యాన్ని మలుపు తిప్పే అవకాశం కలిగి ఉన్నాయి. 

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు