అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా: ట్రంప్‌

Published on Thu, 12/19/2024 - 10:53

వాషింగ్టన్‌ : అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని అన్నారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని  ట్రూత్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.  

పన్నులు, సైనిక రక్షణపై భారీ మొత్తంలో ఆదా అవుతుంది. అందుకే చాలా మంది కెనడియన్లు కెనడా 51వ రాష్ట్రంగా మారాలని కోరుకుంటున్నారు ’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

దీనికి తోడు కెనడా మార్కెట్‌ రిసెర్చ్‌, ఎన్నికల నిర్వహణ సంస్థ ఈ వారం లెగర్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో 13 శాతం మంది కెనడియన్లు సైతం కెనడా దేశం అమెరికాలో కలిపితేనే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.  

 

గతంలోనూ
ట్రంప్ కెనడా గురించి వ్యాఖ్యలు చేయడం ఇలా తొలిసారి గతంలోనూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా తర్వాత ట్రంప్‌ మరింత దూకుడుగా వ్యవహిస్తున్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనలో భాగంగా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భేటీ అయ్యారు. ఆ భేటీలో  ట్రూడో - ట్రంప్‌లు పలు అంశాలపై చర్చించారు.

అమెరికా మీడియా కథనాల ప్రకారం.. మెక్సికో, కెనడా, చైనాలపై అదనపు దిగుమతి సుంకాలు విధిస్తానన్న అంశం, అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అంశాలు ట్రంప్, ట్రూడో మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పన్నులు పెరిగితే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు తప్పవని ట్రంప్‌కు ట్రూడో స్పష్టంచేశారు. దీనిపై వెంటనే ట్రంప్‌ స్పందించారు.

‘‘ అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్‌ డాలర్లకు చేరువవుతోంది. ఇలాంటి కష్టకాలంలో మేం పన్నులు పెంచక తప్పదు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టండి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోండి. ప్రత్యేక దేశంగా ఉంటూ కూడా ఇవన్నీ చేయడం మీ వల్ల కాకపోతే అంతటి భారీ పన్నులను తప్పించుకోవడం కోసమైనా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోండి’’ అని ట్రంప్‌ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు.

దీంతో ట్రూడో నిశ్చేష్టులయ్యారని వినికిడి. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగలేక ట్రూడో ముఖంపై కృత్రిమ నవ్వును ఒలకబోశారని అక్కడి వారు చెప్పారు. ‘‘ కెనడా అమెరికాలోకి చేరాక రెండు రాష్ట్రాలుగా ముక్కలైతే బెటర్‌. ఒక ముక్కకు ట్రూడో గవర్నర్‌గా ఉండటం ఇంకా బెటర్‌. రెండు రాష్ట్రాల్లో ఒకటి లిబరల్‌ స్టేట్‌గా, మరోటి కన్జర్వేటివ్‌ స్టేట్‌గా ఉంటే బాగుంటుంది’’ అని ట్రంప్‌ ముక్తాయించాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)