Breaking News

భారత్‌పై అమెరికా సుంకాల మోత

Published on Wed, 07/30/2025 - 17:53

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై సుంకాల మోత మోగించారు. భారత్‌పై 25శాతం సుంకాలే కాదు అదనంగా పెనాల్టీ  విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్‌ బాంబ్‌ పేల్చారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ఆట్వీట్‌లో భారత్‌పై టారిఫ్‌తో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 1 నుంచి  అమల్లోకి రానుంది. 

భారత్‌ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్‌లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు. భారత్‌.. రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌ నిర్ణయం హేయమైన చర్య’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  

భారత్ మా స్నేహ దేశమే. కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25శాతం టారిఫ్‌తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్‌ సోషల్‌ వేదికగా చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

 

 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)