Breaking News

హెచ్‌–1బీ, పౌరసత్వం గగన కుసుమమే!

Published on Sun, 07/27/2025 - 05:53

వాషింగ్టన్‌: నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన హెచ్‌–1బీ వీసాల జారీ ప్రక్రియను ట్రంప్‌ సర్కారు సమూలంగా ప్రక్షాళన చేయనుంది. అమెరికా పౌరసత్వ పరీక్షలను అత్యంత కఠినతరం చేయనుంది. న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌∙డైరెక్టర్‌ జోసెఫ్‌  పలు అంశాలపై మాట్లాడారు. ఇకపై దేశీ ఉద్యోగులకు అత్యధిక వేతానాలిచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు. 

పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను హెచ్‌–1బీ వీసాలపై రప్పించుకుని అల్ప వేతనాలకు నియమించుకుంటూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నాయంటూ అధికార రిపబ్లికన్‌ పార్టీ ప్రజాప్రతినిధులు చాలాకాలంగా గగ్గోలు పెడుతుండటం తెలిసిందే. ఈ ఆందోళనలకు ట్రంప్‌ సర్కారు తాజా నిర్ణయాలు చెక్‌ పెడతాయని భావిస్తున్నారు.

 అయితే వ్యాపార వర్గాలు, కంపెనీలకు మాత్రం ఇది మింగుడు పడకపోవచ్చని అమెరికా మీడియా కోడై కూస్తోంది.  విదేశీయుల కోసం అనుసరిస్తున్న పౌరసత్వ పరీక్ష మరీ సులభతరంగా ఉందని జోసెఫ్‌ ఆక్షేపించారు. ‘‘పరీక్షలో తేలికపాటి ప్రశ్నలున్నాయి. ఇది చట్టస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపై కఠిన ప్రశ్నలతో పరీక్షను మరింత పకడ్బందీగా మారుస్తాం’’అని స్పష్టం చేశారు.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)