Breaking News

పాపం.. రన్‌వేపైనే కబళించిన మృత్యువు

Published on Mon, 06/08/2026 - 08:59

ఆ విమానం అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఎందుకు ప్రయత్నించిందో తెలియదు. రన్‌వేపై ఘోరంగా తడబడింది.  చూస్తుండగానే ప్రైవేట్ జెట్‌ అదుపుతప్పి కుప్పకూలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే విమానం అగ్నిగుండాన్ని తలిపించింది. పైలట్‌ చేసిన ప్రయత్నం చివరకు విషాదాంతంగా మారింది. ఆ మంటల్లో చిక్కుకుని పైలట్‌, కో-పైలట్‌ ప్రాణాలు కోల్పోయారు.  

డొమినికన్‌ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్‌ రన్‌వేపై సురక్షితంగా దిగకముందే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనాస్థలం అగ్నిగుండంలా మారిపోయింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో ఉన్న పైలట్‌, కో-పైలట్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.

విమానం ఏ కారణంతో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిందన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక లోపమా? ఇంజిన్‌ సమస్యా? లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్‌ విమానాన్ని సురక్షితంగా కిందికి దించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరి క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. దీంతో రన్‌వేకు చేరకముందే విమానం నేలపై కూలిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీ మంటలు ఎగసిపడ్డాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో విమానం శకలాలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, విమానం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.

ఈ ఘటనపై విమానయాన అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. విమానం నిర్వహణ రికార్డులు, సాంకేతిక పరిస్థితి, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో జరిగిన సంభాషణలు, ఫ్లైట్‌ డేటా తదితర అంశాలను పరిశీలించనున్నారు. అయితే ప్రమాదానికి దారితీసిన అసలు కారణం ఏంటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)