Breaking News

స్టీరింగ్‌ చేతిలో.. సడన్‌గా డ్రైవర్‌ మాయం!

Published on Sat, 07/18/2026 - 10:55

కొన్నిసార్లు ప్రమాదాలు కూడా నవ్వులు పూయిస్తాయి. అలాంటి ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సరదా ట్రిప్‌లో భాగంగా గోల్ఫ్‌ కార్ట్‌ నడుపుతున్న ఓ యువతి.. రోడ్డుపై ఫోకస్‌ కోల్పోవడంతో చివరకు వాహనం నేరుగా పొదల్లోకి వెళ్లిపోయింది.

వైరల్‌గా మారిన 13 సెకన్ల వీడియోలో..  కొందరు గోల్ఫ్‌ కార్ట్‌లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆకులతో నిండిన సన్నని దారిలో కార్ట్‌ వెళ్తుండగా.. డ్రైవర్‌ ఒక్కసారిగా రోడ్డుపై దృష్టి కోల్పోయింది. పక్కనే ఉన్న యువతి కింద పడిపోగా.. డ్రైవింగ్‌ చేస్తున్న సంగతి మరిచిపోయి కంగారులో స్టీరింగ్‌ వదిలేసింది. కింద పడిన యువతి కోసం ఈమె కూడా దూకేసింది. వెనక కూర్చున్నవాళ్లు ఆ షాకింగ్‌ పరిణామాన్ని తొంగి చూస్తూ ఉండిపోయారు. మరి డ్రైవర్‌ మాయమైతే.. వాహనం నడిపేదెవరు?.. 

అందుకే వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికుల్లో ఒకరు ఒక్కసారిగా కిందకు జారిపడటం, ఆ వెంటనే డ్రైవర్‌ సీట్‌లో యువతి కూడా దూకేయడం.. ఆ వీడియోను మరింత వినోదంగా మార్చింది.

వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. “డ్రైవర్‌ అని మర్చిపోయి పార్టీకి వచ్చిందా?” అంటూ కొందరు సరదాగా స్పందించగా.. మరికొందరు “రోడ్డుపై చూపు ఎప్పుడూ ముందే ఉండాలి” అంటూ జాగ్రత్తలు సూచించారు.

మిలియన్లకు పైగా వ్యూస్‌.. కామెంట్ల వర్షం
పెచే ఆఫ్రికా షేర్‌ చేసిన ఈ వీడియోకు సోషల్‌ మీడియాలో భారీ స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో లైక్స్‌, షేర్స్‌ రావడంతో పాటు.. ఈ ఘటనపై మీమ్స్‌ కూడా పుట్టుకొచ్చాయి. కొందరు దీనిని జీవితానికి ఉదాహరణగా పోల్చుతూ.. “దృష్టి ఎక్కడ ఉంటే ప్రయాణం కూడా అక్కడికే వెళ్తుంది” అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.

ఈ ఘటన సరదాగా ముగిసినప్పటికీ.. వాహనం నడిపేటప్పుడు దృష్టి మరల్చడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో.. ఈ గోల్ఫ్‌ కార్ట్‌ ప్రమాదం ఇప్పుడు సోషల్‌ మీడియాలో నవ్వుల పండుగగా మారింది. “రోడ్డుపై డ్రైవింగ్‌.. పార్టీలో డ్యాన్స్‌ కాదు!” అంటూ నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ టచ్‌ ఇస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)