Breaking News

పాక్‌లో షరారత్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా, అమ్మాయిల స్టెప్పులు వైరల్‌

Published on Mon, 01/05/2026 - 16:38

బాలీవుడ్‌ స్టార్‌హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్‌ మూవీ దురంధర్‌ (Dhurandhar ) బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతేకాదు గ్లోబల్‌గా కూడా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ మూవీలో పాటల క్లిప్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా   'షరారత్' (Shararat) పాటతో ఒక పెళ్లి వేడుకలో పాకిస్తాన్‌ అమ్మాయిలు స్టెప్పులు నెట్టింట సందడిగా మారాయి.

పాకిస్తానీ మహిళలు సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తోంది. ఈ క్లిప్‌లో, ఇద్దరు మహిళలు పెళ్లి వేదిక లోపల 'షరారత్' పాటకు డ్యాన్స్ చేస్తుండగా, ఇతర అతిథులు వారిని చూస్తూ ప్రోత్సహిస్తున్నారు.ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంతటి ఆదరణ పొందడంపై కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. “నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఇంత క్రేజ్.. వావ్,” అని ఒకరు, “పాకిస్తానీలు దురంధర్‌ను విపరీతంగా ఇష్టపడు తున్నారు. బహుశా ఈ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్‌కు నిషాన్-ఎ-పాకిస్తాన్ ఇస్తారేమో అని మరొకరు వ్యాఖ్యానించారు. భారత ఉపఖండంపై బాలీవుడ్‌ సాంస్కృతిక ముద్ర  ఉందని మరకొరు కమెంట్‌ చేశారు.

కాగా దురంధర్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే పాకిస్తాన్‌తో పాటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలలో ఈ మూవీ విడుదల కాలేదు. అయినా కూడా 2025లో విదేశాలలో అత్యంత విజయ వంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది.

మరోవైపు ఆయేషా ఖాన్,క్రిస్టల్ డిసౌజా నటించిన 'షరారత్' డ్యాన్స్ నంబర్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో 100 మిలియన్ల వీక్షణలను దాటింది. ఈ పాటకు శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించగా, మధుబంతి బాగ్చి , జాస్మిన్ సాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదొక గూఢచారి థ్రిల్లర్ చిత్రం.  ఈ మూవీలో  రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ,సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని రెండవ భాగం మార్చి 2026లో విడుదల కానుందని భావిస్తున్నారు.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)