Breaking News

అగ్రరాజ్యానికి వార్నింగ్.. ఆ రూల్ ప్రకారమే దాడి చేస్తాం..!

Published on Fri, 01/09/2026 - 04:30

అగ్రరాజ్యం అమెరికాను డైన్మార్క్ హెచ్చరించింది. గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించినట్లయితే దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా ఆదేశాలు లేకుండానే సైనికులు కాల్పులు జరుపుతారని  డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ సైనికులు ముందుగా కాల్పులు జరిపిన తర్వాతే ప్రశ్నలు అడుగుతారని డానిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 1952 నాటి ఆర్మీ ఎంగేజ్‌మెంట్ రూల్స్ ప్రకారం ఇదే జరుగుతుందని వెల్లడించింది. ఈ రూల్ ప్రకారం సైనికులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి ఉండకుండా దురాక్రమణదారులపై దాడి చేస్తారని తెలిపింది.

నాటో భూభాగమైన గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలు ప్రారంభించడంతోనే డెన్మార్క్ ఈ ప్రకటన చేసింది. ఈ ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా పరిశీలిస్తున్న ఎంపికల్లో సైనిక శక్తి ఒకటిగా పేర్కొంది. కాగా.. ఇటీవల వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్భంధించాక పలు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు జాతీయ భద్రతా ప్రాధాన్యత. ఆర్కిటిక్ ప్రాంతంలో మన ప్రత్యర్థులను అరికట్టడానికి అవసరమని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ కీలకమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి సరైన ఎంపికలను పరిశీలిస్తున్నాం. యుఎస్ మిలిటరీని ఉపయోగించడం ఎల్లప్పుడూ ఒక ఎంపిక." అని అన్నారు.

వచ్చే వారం డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ అధికారులతో సమావేశం కావాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఓ నివేదిక ప్రకారం ట్రంప్ సైనిక బలప్రయోగం కాకుండా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇంతలోనే అమెరికా అధికారులతో సమావేశాన్ని డెన్మార్క్ స్వాగతించింది. దీనిని ఒక ముఖ్యమైన చర్చగా పేర్కొంది.

 

Videos

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)