Breaking News

గాజాలో పని పూర్తిచేసే తీరుతాం 

Published on Sat, 09/27/2025 - 05:58

ఐక్యరాజ్య సమితి: గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని, పని పూర్తిచేసి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ స్పష్టంచేశారు. గాజా యుద్ధం, పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమదేశాలు తలొగ్గవచ్చేమో కానీ.. ఇజ్రాయెల్‌ మాత్రం వెనక్కు తగ్గదని తేల్చి చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. 

ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని దేశాలు నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించాయి. కొన్ని దేశాల ప్రతినిధులు సభలోనే ఉండి నెతన్యాహూ ప్రసంగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమెరికా మాత్రం ఎప్పటిలాగే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. చాలావరకు ముఖ్య దేశాలన్నీ ఈ సమావేశానికి జూనియర్‌ అధికారులను పంపి తమ నిరసనను తెలిపాయి. 

గాజాపై దాడులను ఆపాలని అంతర్జాతీయంగా ఎంతగా ఒత్తిళ్లు వస్తున్నా.. నెతన్యాహూ పట్టించుకోకపోవటంతో ఇటీవలే ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్‌ వంటి దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రమంగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతున్నా నెతన్యాహూ వెనక్కి తగ్గేదే లేదు అని ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించిన దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమదేశాల నేతలు ఒత్తిళ్లకు తలొగ్గవచ్చు. 

కానీ, మీకు నేను ఒక హామీ ఇస్తున్నా.. ఇజ్రాయెల్‌ ఎప్పటికీ తలొగ్గదు. మీ అవమానకరమైన నిర్ణయం (పాలస్తీనాను దేశంగా గుర్తించటం) యూదులు, అమాయక పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. యూదు వ్యతిరేక భావజాలం ఎప్పటికీ అంతమవదేమో.. కానీ, అది దారుణంగా చావాలి’అని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా నెతన్యాహూ, ఆయన బృందం ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిచేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లిన ఘటనను చూపించే క్యూఆర్‌ కోడ్‌ను ధరించారు. ‘ది కర్స్‌’పేరుతో రూపొందించిన ఓ మ్యాప్‌ను కూడా ప్రదర్శించారు. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)