Breaking News

Venezuela: డెన్సీ రోడ్రిగ్జ్‌ వీడియో టేపుల కలకలం

Published on Sun, 01/25/2026 - 09:28

కారకస్: ‘మేం చెప్పినట్లు వింటారా? లేదంటే మరో 15 నిమిషాల్లో మీ ప్రాణాలు తీయమంటారా?’ అంటూ తమని బెదిరించారంటూ  అమెరికాపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ చేసిన కామెంట్స్‌ తాలుకూ వీడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి.    

జనవరి 3న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్‌ మదురో దంపతులను అమెరికా నిర్బంధించి పదవీచ్యుతున్ని చేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రత్యేక దళాలు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’(Operation Absolute Resolve) పేరుతో మిలటరీ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ మిలటరీ ఆపరేషన్‌లో డెల్టా ఫోర్స్ సైనికులు హెలికాప్టర్ల ద్వారా వెనెజువెలా రాజధాని కారాకస్‌లోని ఫోర్ట్ టియునా సైనిక స్థావరంలోకి ప్రవేశించి మదురో దంపతుల్ని అదుపులోకి తీసుకున్నారు.

అయితే, మదురో దంపతుల్ని నిర్భందించిన 15 నిమిషాల తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాదురోను అమెరికా దళాలు పట్టుకున్న తర్వాత.. తమ డిమాండ్లను అంగీకరించాలని తమ మంత్రివర్గ సభ్యులకు బెదిరింపులను అమెరికా బెదిరించినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ అంతర్గత సమావేశంలో మాట్లాడిన వీడియో టేపులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.  తాము చెప్పినట్లు వినకపోతే 15 నిమిషాల్లో మంత్రి వర్గ సభ్యుల ప్రాణాలు తీస్తామని అమెరికా దళాలు బెదిరించాయని డెల్సీ రోడ్రిగ్స్ మాట్లాడిన మాటలు ఆ వీడియోలో ఉన్నట్లు సమాచారం. 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)